బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలను అమెరికా గడ్డ మీద కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కేటీఆర్, బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు డాలస్ చేరుకున్నారు. డాలస్ ఎయిర్ పోర్టులో కేటీఆర్ దిగిన సందర్భంగా ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ సెల్ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో కేటీఆర్ చుట్టూ గట్టి బందోబస్తు దృశ్యం అత్యంత ఆసక్తికరంగా కనిపించడం విశేషం. జెమాజెట్టీల్లాంటి అయిదుగురు వ్యక్తులు కేటీఆర్ చుట్టూ రక్షణ వలయంలా నిల్చుని ఎయిర్ పోర్టు నుంచి తీసుకువెడుతున్న చిత్రం ఇది. అయితే ఈ సెక్యూరిటీ సిబ్బంది అమెరికా ప్రభుత్వ భద్రతా బలగాలా? లేక ప్రయివేట్ భద్రతా బలగాలా? అనే అంశంపై సరైన సమాచారం లేదు.



