హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్య సునీతను గెలిపించుకోవలసిన అవశ్యకతను వివరించారు. కారు కావాలో, బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలని నియోజకవర్గ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ నాయకులు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లను చేర్చించారని, అటువంటి అంశాలపై బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.