ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీపీఐకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగాని ధన్యవాద తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో కూనంనేని మాట్లాడుతూ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు సీఎంను కలిసే అవకాశం లభించకపోవడాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యక్తిత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.
రేవంత్ రెడ్డి తనకు మొదటి నుంచి పరిచయమేనని, ఆయన ఎంత ఎగ్రెస్సివో, అంత పాజిటివ్ గా, అప్రోచ్ బుల్ గా ఉంటారన్నారు. రేవంత్ రెడ్డిలో అవసరమైతే ఆవేశం ఉందని, ఆగ్రహం ఉంటుందని, కానీ అహంభావం లేదన్నారు. అహంభావం వేరు, ఆవేశం వేరని సాంబశివరావు అన్నారు. అయితే కమ్యునికేషన్ గ్యాప్ పై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పేద వర్గాల సంగతి చూడాలని, కొత్తగూడేనికి ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కీలక వ్యాఖ్యలను దిగువన గల వీడియోలో చూడవచ్చు..