Top 5 This Week

Related Posts

కిషన్ రెడ్డికి ప్రమోషన్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది. బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కిషన్ రెడ్డితో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

కిషన్ రెడ్డి పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రధాని మోదీ ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిని కల్పించడం విశేషం. తెలంగాణ నుంచి మొట్ట మొదటి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కడంతో జంట నగరాల్లోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు.

Popular Articles