ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్ జీ భార్య సుజాతక్క అలియాస్ మైనక్క అలియాస్ పోతుల కల్పన తెలంగాణా డీజీపీ ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. సుజాతక్క ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ నేతగా ఉన్న సుజాతక్క స్వస్థలం గద్వాల. లాల్ గఢ్ ఉద్యమ నేత, పశ్చిమ బెంగాల్ ఎన్కౌంటర్ లో మరణించిన మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీని సుజాతక్క 1984లో పెళ్లి చేసుకున్నారు. తొలుత రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన సుజాతక్క ఛత్తీస్ గఢ్ లోని కొన్ని జిల్లాల్లో మావోయిస్టులు సమాంతర పాలన సాగించిన జనతన సర్కార్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దాదాపు 106 కేసుల్లో నిందితురాలైన సుజాతక్క లొంగుబాటు గురించి తెలంగాణా డీజీపీ మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.


