Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

ఖమ్మం యువతికి ప్రధాని చేతుల మీదుగా అవార్డు

ఢిల్లీ: ఖమ్మం జిల్లాకు చెందిన యువతికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన తాళ్లూరి పల్లవి ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం ఈ అవార్డును అందుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌ (Artificial intelligence programming assistant) విభాగంలొ పల్లవి ఈ అవార్డును అందుకున్నారు.

యువతలో స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు (PM-SETU) పథకాన్ని రూ. 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలొ బాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులకు అవార్డులను ప్రధాని మోదీ ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విభాగంలొ ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టాపర్‌ గా ఎన్నికైన తాళ్లూరి పల్లవికి ఈ అవార్డు దక్కింది. తమ కుమార్తెకు ఈ అవార్డు లభించడంపై పల్లవి తల్లిదండ్రులు తాళ్లూరి రవి, అజిత సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Popular Articles