Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు టెండర్ తేదీ ఖరారు

ఖమ్మం శివార్లలోని పోలేపల్లిలో గల రాజీవ్‌ స్వగృహ ఆధ్వర్యంలో పూర్తి అయిన, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి లోని రాజీవ్ స్వగృహ భవన సముదాయాన్ని సోమవారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎస్ఇ భాస్కర్ రెడ్డి, ఇఇ నరేందర్ రెడ్డి, జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, బిల్డర్స్ తో కలిసి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిర్మాణంలో ఉన్న ఎనిమిది బ్లాక్ లు తిరుగుతూ ఇళ్లను పరిశీలించారు. ఆనతరం కలెక్టర్ రాజీవ్ స్వగృహ టౌన్ షిప్ బహిరంగ వేలానికి సంబంధించి జిల్లా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, బిల్డర్స్ తో ఫ్రీబిడ్ ముందస్తు అవగాహనా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీాప్ దురిశెట్టి మాట్లాడుతూ, ఖమ్మంలోని రాజీవ్ స్వగృహకల్ప అనేది సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఉద్దేశించి రూపొందించబడిన గృహనిర్మాణ సముదాయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు రాజీవ్‌ స్వగృహ మంచి సదావకాశమన్నారు. పోలేపల్లి రెవెన్యూ పరిధిలోని మున్నేరు ఒడ్డున బహుళ అంతస్తుల భవనాలలో ఎనిమిది బ్లాకులు, తొమ్మిది ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్‌కు 8 ఫ్లాట్లు ఉన్నాయన్నారు. మొత్తం మీద 576 ఫ్లాట్లు ఉన్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, ఇంటీరియర్ డెకరేషన్‌ పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు.

అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును మొత్తంగా ప్రాజెక్టుగా అందుబాటులో ఉన్న బహిరంగ భూమిని మినహాయించి ఉన్న చోట ఉన్న విధంగానే ప్రాతిపదికన విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇఎండీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్న సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు సహా వ్యక్తులు ఎవరైనా సరే సెప్టెంబర్ 6వ తేదీ వరకు బహిరంగవేలంలో టెండర్ దాఖలు చేయవచ్చని చెప్పారు.

ఖమ్మంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ అనుదీప్

ఉద్యోగస్తులకి ఈ గేటెడ్ కమ్యూనిటీని అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్యోగ సంఘాలు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా గుర్తుచేస్తూ కలెక్టర్ అభినందించారు. త్వరలో మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని, తద్వారా ఖమ్మం నగరానికి పడమర భాగంలో ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, హైవే రోడ్డు మార్గాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ భవన సముదాయానికి 60 ఫీట్ల రోడ్డు మంజూరైందని, పనులు వేగంగా పనులు జరుగుతాయన్నారు. సంఘం తరఫున ఉద్యోగులు ఈ సముదాయాన్ని ఫ్లాట్లుగా కొనేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీ నమూనా రూపొందించిన బ్రోచర్ ను కలెక్టర్ పరిశీలించారు.

Popular Articles