మహాశివరాత్రి సందర్భంగా తీర్థాల జాతరకు వెళ్లే భక్తులకు ఖమ్మం పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈమేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా జాతరకు వాహనాల్లో వెళ్లే భక్తులు అనుసరించాల్సిన పద్ధతులు, పార్కింగ్ ప్రదేశాలపై సీపీ పలు సూచనలు చేస్తూ ప్రకటన జారీ చేశారు. ఆయా ప్రకటనలలోని వివరాలు:
ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే వాహనాలు వయా దానవాయిగూడెం, రామన్నపేట, కామాంచికల్ మీదుగా వచ్చి కామాంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జి రోడ్డుకి ఇరువైపుల సూచించిన పార్కింగ్ స్థలంలో ఆర్టీసీ బస్సులు మినహా, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పార్కింగ్ చేసుకోవాలి. ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పాటివారి గూడెం నుండి జాన్ బాద్ తండా వెళ్లే దారిలొ వెళ్లి కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు పార్కింగ్ చేయాలి.
డోర్నకల్, పాపటిపల్లి మీదుగా వచ్చే వాహనాలు కామాంచికల్ గ్రామానికి ముందు చెరువు వద్ద కుడి వైపు ఉన్న జామయిల్ తోటలో గల పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలపాలి.
మద్దివారిగూడెం, మంగళగూడెం వైపు నుంచి వచ్చే వాహనాలకు తీర్దాల గ్రామ ప్రవేశం వద్ద వాహనాలు నిలుపుకోవాలి.
కురవి, ములకలపల్లి వైపు నుండి తీర్దాల జాతరకు చేరుకునే భక్తులు తమ వాహనాలైన ఆటోలు, ట్రాక్టర్లు వయా యంవి పాలెం, గుండాల తండా మీదుగా తీర్దాలకు చేరుకోవాలి.

ఖమ్మం రూరల్ నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లు వయా పల్లెగూడెం, గోళ్ళపాడు మీదుగా ఆకేరు బ్రిడ్జి వరకు మాత్రమే అనుమతిస్తారు.
రహదారికి ఇరువైపుల, రహదారిపై వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో నిలుపరాదు. నిర్దేశించిన పార్కింగ్ స్థలం లో మాత్రమే వాహనాలు నిలపాలి.
అదేవిధంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన భక్తులు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో గోళ్లపాడు రహదారి వన్ వే చేయడం వలన కామంచికల్ గ్రామ పంచాయతీ దగ్గర నుండి వయా ముత్యాలగూడెం, కోయ చిలక గ్రామాల వైపు నుండి ఖమ్మం వెళ్లాలి.
పల్లెగూడెం మీదుగా వచ్చే ట్రక్కులు ట్రాలీలు ఎంవీ పాలెం మీదుగా గూడూరుపాడు, తనగంపాడు, గుండాల తండా మీదుగ తీర్దాల రావాలి.
టెంపుల్ కు చుట్టుపక్కల ఒక కిలోమీటరు వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు.
వివిధ ప్రాంతాల నుంచి జాతరకు వచ్చు భక్తులు వారి వారి వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాలలో నిలిపి డ్యూటీలో ఉన్న పోలీసులకు. తోటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించి జాతరను విజయవంతం చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు.