Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

విజయవాడలో ‘ఖమ్మం జువెల్లరీ ఖ్యాతి’ ప్రదర్శన

పెద్ద పెద్ద నగరాలు కేంద్రంగా వ్యాపారం నిర్వహించే బడా వ్యాపార సంస్థలు చిన్న చిన్న పట్టణాల్లో తమ వ్యాపార వస్తువులను ప్రదర్శించడం విశేషం కాకపోవచ్చు. కానీ చిన్న నగరాలు కేంద్రంగా వ్యాపారం సాగించే వాణిజ్య సంస్థలు పెద్ద నగరాల్లో తమ వ్యాపార సరుకుతో ఎగ్జిబిషన్ నిర్వహించడం ఖచ్చితంగా విశేషమే. తమ ఆకర్షణీయ, నాణ్యమైన వస్తువులతో స్థానిక ప్రజల మనసు గెల్చుకోవడం ద్వారా ఖ్యాతి గడించిన వ్యాపార సంస్థలు పెద్ద నగరాలకు తమ వ్యాపారన్ని విస్తరింపజేయడం ఆసక్తికర అంశమే.

సరిగ్గా ఇదే కోణంలో ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ బంగారు, వెండి నగల షాపు ‘శ్రీ వెంకట్రామా జువెల్లర్స్’ విజయవాడ నగరంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో తమ సంస్థ తరపున తయారైన బంగారు, వెండి నగలను ప్రదర్శిస్తున్నట్లు సంస్థ అధినేత రాయపూడి వెంకట రామారావు చెప్పారు. విజయవాడలోని A కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ లో తమ సంస్థ నగలను విలువైన కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అత్యంత నాణ్యతతో, సరికొత్త డిజైన్లతో తయారు చేయించిన తమ సంస్థ నగలను విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు వినియోగించుకోవాలని రాయపూడి వెంకట రామారావు కోరారు.

Popular Articles