Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఖమ్మం సీపీఎంలో తీవ్ర విషాదం

ఖమ్మం జిల్లా సీపీఎంలో విషాదం అలుముకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ మధురైలో గుండెపొటుతో ఆకస్మిక మృతి చెందారు. మధురైలో జరుగుతున్న సీపీఎం ఆలిండియా మహాసభల్లో పాల్గొనేందుకు శ్రీకాంత్ అక్కడికి వెళ్లారు. శ్రీకాంత్ తోపాటు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు, పార్టీ రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్ రావు, మాచర్ల భారతిలు మధురై వెళ్లారు.

అయితే తనకు కాస్త నలతగా ఉందని శ్రీకాంత్ నిన్ననే సహచర పార్టీ నాయకులకు చెప్పడంతో నున్నా నాగేశ్వర్ రావు తదితర నాయకులు ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు, స్థానికంగా అందించిన చికత్స అనంతరం బాగానే ఉన్నట్లు పేర్కొనడంతో శ్రీకాంత్ యథావిధిగానే ఉన్నారు. అయితే ఈరోజు ఉన్నట్టుండి తీవ్ర గుండె నొప్పితో శ్రీకాంత్ కుప్పకూలి తుదిశ్వాస విడిచారు.

ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన యర్రా శ్రీకాంత్ కు ఆ ప్రాంతంలో జనాభిమాన కామ్రేడ్ గా పేరుంది. త్రీటౌన్ లోనే గాక ఖమ్మం నగరంలోనూ సీపీఎం పార్టీ విస్తరణకు, పార్టీ పటిష్టతకు శ్రీకాంత్ తీవ్ర కృషి చేశారు. ఖమ్మం పట్టణ కార్యదర్శిగానూ శ్రీకాంత్ గతంలో పని చేశారు. శ్రీకాంత్ ఆకస్మిక మరణంతో సీపీఎంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Popular Articles