Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పార్కు కాదు సుమీ.. అందమైన కలెక్టరేట్!

సుందర దృశ్యాలతో కనిపిస్తున్న ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన పార్క్ అనుకుంటే మీరు పొరపడినట్లే.. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయమిది.. పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా గార్డెనింగ్ ఏర్పాటు చేయడంతో కనువిందు చేస్తున్న దృశ్యాలివి .

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేక శ్రద్ధతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటులో భాగంగా పూలు, అలంకరణ, వివిధ రకాల మొక్కలను నాటారు.

కలెక్టరేట్ లోని ఫౌంటెన్, ఆవరణ చుట్టూరా అలంకరణ మొక్కలను నాటడంతో పాటు పూల మొక్కలను కుండీలలో కార్యాలయం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన గార్డెనింగ్ లో, పూల కుండీలలో కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా పోయిన్సెట్టియా రెడ్, మినీ ఇగ్సొర, టోపియరీ – ఫికస్ బ్లాక్, అరెకా పామ్, సైకస్, పెన్సిల్ పెయిన్, హేలికోనియా ఆరంజ్, కోలియస్ రెడ్, బ్లాకు ఏరాంతమం, దేనేలియ వేరిగేటేడ్, ట్యూబ్ రోజ్ -డబల్ ఫ్లవర్, ట్యూబ్ రోజ్ సింగిల్ ఫ్లవర్, లెమన్ గ్రాస్, క్రీపర్, ఆగ్లోనియ, చైనా బాక్స్, క్రైసాంతిమం, హైబ్రిడ్ రోజ్, రాయల్ పామ్, గోల్డెన్ దురంత, రాదర్ మాచెర వంటి రకాల దాదాపు 12 వేలకు పైగా మొక్కలను ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్ భవనం మధ్యలో అందమైన ఆకృతిలో పచ్చిక పూల మొక్కలను ఫౌంటేన్ చుట్టూ అద్భుతంగా నాటారు. ఈ గార్డెన్ తో జిల్లా కలెక్టరేట్ సరికొత్త రూపును సంతరించుకుంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ వద్ద గార్డెనింగ్ తో పాటు కలెక్టర్ ఛాంబర్ ప్రక్కన, ప్రవేశం దగ్గర, కార్యాలయాల వద్ద కుండీలలో కూడా మొక్కలను అధికారులు ఏర్పాటు చేశారు.

Popular Articles