Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఫాస్ట్ ట్రాక్ కోర్టు-2 న్యాయమూర్తి జస్టిస్ కె. ఉమాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సత్తుపల్లి మండలానికి చెందిన ఏడేళ్ల బాలిక 2023 ఆగస్టు 13వ తేదీన ఇంటి బయట అడుకుంటుండగా కొత్తూరు గ్రామానికి చెందిన మామిడి పాపారావు (30) ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఏడుస్తూ, తీవ్ర భయాందోళనకు గురై ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్నిచెప్పింది. జరిగిన ఘోరంపై బాధిత బాలిక తల్లిదండ్రులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నిందితుడు పాపారావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సత్తుపల్లి పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను, సాక్ష్యాధారాలను, వైద్య నివేదికను పరిశీలించిన అనంతరం నిందితుడు పాపారావును దోషిగా నిర్ధారిస్తూ అతనికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ మహ్మద్ ఇర్సాద్ వాదించారు. కేసును సమర్ధవంతగా దర్యాప్తు చేసి దోషికి శిక్షపడే విధంగా విధులు నిర్వహించిన అప్పటి సత్తుపల్లి ఏసీపీ రామానుజం, ప్రస్తుత ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ M.రవి కుమార్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, శ్రీకాంత్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles