Friday, March 6, 2026

Top 5 This Week

Related Posts

బీఆర్ఎస్ నిరసనలో ఖమ్మం సీఐ చేతికి ఫ్రాక్చర్

ఖమ్మం: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరిగింది. ఇల్లెందు క్రాస్ రోడ్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధపడ్డారు. అయితే బీఆర్ఎస్ కేడర్ చర్యను సీఐ కరుణాకర్ నిలువరించేంందుకు ప్రయత్నించారు.

ఈ సందర్బంగా పోలీసులకు, బీఆర్ఎస్ కేడర్ కు మధ్య తోపులాట జరిగింది. ఈ పరిణామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తోసివేయడంతో కిందపడిన సీఐ కరుణాకర్ చేయి విరిగింది. చికిత్స కోసం కరుణాకర్ ను ప్రయివేట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. సీఐ విధులకు ఆటంకం కలిగించి, అతన్ని గాయపర్చారనే అభియోగంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్న సమాచారం ధ్రువపడాల్సి ఉంది.

బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు (బ్లాక్ షర్ట్ ధరించిన వ్యక్తి)

Update:
కాగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన ప్రదర్శనలో సీఐ కరుణాకర్ గాయపడడానికి దారి తీసిన ఘటనలో నమోదైన కేసులో నాగరాజును అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తో వైరాకు వెళ్లి తిరిగి వస్తుండగా, శ్రీశ్రీ సర్కిల్ వద్ద నాగరాజును అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది.

Popular Articles