Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ గూటికి ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్లు

హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 7వ తేదీన ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నాయకత్వంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమక్షంలో వీరందరూ గాంధీభవన్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లలో చిరుమామిళ్ల లక్ష్మి (12వ డివిజన్), గోళ్ల చంద్రకళ (25వ డివిజన్), డోణవాన్ సరస్వతి (32వ డివిజన్), దాదె అమృతమ్మ (40వ డివిజన్), మోతారపు శ్రావణి (55వ డివిజన్)లు ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరందరినీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్ధవంతమైన నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నిలిపేందుకు వీరందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ లో చేరినట్లు ప్రకటించారు.

Popular Articles