Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కర్నాటకలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న అక్కడి కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణా నాయకత్వం నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తూ నిరసన చేపట్టేందుకు బయలుదేరిన బీజేపీ నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ప్రముఖ వైద్యులు డా. శీలం పాపారావు, విద్యాసాగర్, రుద్ర ప్రదీప్, నున్న రవికుమార్, చావా కిరణ్, జ్వాలాగౌడ్, మంద సరస్వతి, నలమాస సుగుణ, చంటి కోటేశ్వర్ రావు, జంపన ప్రసాదరావు తదితరులు ఉన్నారు.

Popular Articles