మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ప్రభుత్వానికి లొంగిపోనున్నారనే ప్రచారంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథగా మావోయిస్టు పార్టీ కొట్టిపారేసింది. ఈమేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో రెండు పేజీల పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథగా ఆయన అభివర్ణించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమన్నారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ ఇంటెలిజెన్స్ అధికారుల కట్టు కథలుగా పేర్కొన్నారు. పోలీసులు అల్లిన నాటకంలో మీడియాను పావులుగా వాడుకున్నారన్నారు. కామ్రేడ్ గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారని, ప్రజా సమస్యలపై నిరంతరం గణపతి పోరాటం చేస్తున్నాడని అభయ్ తన ప్రకటనలో వెల్లడించారు. ఆయా పత్రికా ప్రకటనను దిగువన చూడవచ్చు.

