Top 5 This Week

Related Posts

మంత్రి పొంగులేటి బర్త్ డే: కీలక ప్రకటన ఇదే..!

ఖమ్మం: ఈనెల 28వ తేదీన తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కీలక సూచన వెలువడింది. మంత్రి పొంగులేటి తన పుట్టినరోజు సందర్బంగా మంగళవారం ఖమ్మంలోగాని, హైదరాబాద్ లో గాని అందుబాటులో ఉండడం లేదని, ఆయనను స్వయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని దయాకర్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమల్లో అన్నదానం, పేద విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పొంగులేటి అభిమానులు, శీనన్న అభిమాన సంఘాలు, పార్టీ కార్యకర్తలు అందరూ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ నాయకుడి పట్ల అభిమానాన్ని సేవా రూపంలో చాటాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా పొంగులేటి జన్మదిన సందర్భంగా స్థానికంగా నిర్వహించనున్న వేడుకల వివరాలను దయాకర్ రెడ్డి వెల్లడించారు. ఉదయం 09 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయంలో భారీ కేక్ కటింగ్, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా నేలకొండపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి బైక్ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 09.30గంటలకు వరంగల్ క్రాస్ రోడ్డులో, ఉదయం 10గంటలకు కల్లూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో కేక్ కటింగ్ ఉంటుందన్నారు. ఉదయం 11 గంటలకు ముదిగొండ మెయిన్ సెంటర్ లో అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

ఆ తర్వాత ఉదయం 11.30గంటలకు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్, మధ్యాహ్నం 12గంటలకు ఖానాపురంలోని శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అయ్యప్పస్వాములకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇవేగాక ఇంకా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కావున ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని పొంగులేటి శీనన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ ఆయా ప్రాంతాల్లో జరిగే వేడుకలు, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని దయాకర్ రెడ్డి కోరారు.

Popular Articles