Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మం న్యాయవాద సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కాసర రాజశేఖర్ రెడ్డి

ఖమ్మం న్యాయవాద సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రముఖ అడ్వకేట్ కాసర రాజశేఖర్ రెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో గత రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన ఓట్ల లెక్కింపు అనంతరం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షునిగా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

ఖమ్మం బార్ అసోసియేషన్ హాలులో నిర్వహించిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పోటీలో గల అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం నాలుగు డైరెక్టర్ పదవులకుగాను 549 ఓటర్లలో 429 మంది అడ్వకేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపులో వరుసగా ఆవుల అనూరాధ 308 ఓట్లు, షేక్ నస్రీన్ 291, కాసర రాజశేఖర్ రెడ్డి 261, పాలవెల్లి వెంకటేశ్వర్లు 242 ఓట్ల ఆధిక్యతతో డైరెక్టర్లుగా విజయం సాధించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తర్వాత గతంలో గల డైరెక్టర్లతో కలిపి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాద సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కాసర రాజశేఖర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ పదవికి ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి. అదేవిధంగా సొసైటీ ఉపాధ్యక్షునిగా పిడతల రామమూర్తి, ప్రధాన కార్యదర్శిగా బి. క్రాంతికుమారి, జాయింట్ సెక్రెటరీగా పలివెల శ్రీలక్ష్మి, కోశాధికారిగా భూక్యా రమేష్ లు ఎన్నికయ్యారు.

ఖమ్మం న్యాయవాద సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం

అందరికీ ధన్యవాదాలు: రాజశేఖర్ రెడ్డి
తనను మరోసారి సొసైటీ అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతిఒక్కరికీ కాసర రాజశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అందరి అశీస్సులతో, మద్ధతుతో మూడుసార్లు డైరెక్టర్ గా, అధ్యక్షునిగా కూడా విజయవంతంగా గెలిచినట్లు చెప్పారు. తనపై నమ్మకంతో బాసటగా నిలిచి గెలిపించినవారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిజాయితీతో, అంకితభావంతో సొసైటీ అధ్యక్షునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, న్యాయవాదులకు నిరంతరంగా సేవ చేస్తూనే ఉంటానని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

Popular Articles