కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శుభ కామేశ్వరీ దేవి గురువారం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేల నగదును లంచంగా స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావలసి ఉంది.

