ఖమ్మం జిల్లా కొండ వనమాలలో కంఠమహేశ్వరస్వామి ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తమ కుల దైవం కంఠ మహేశ్వర స్వామి సురమాంబాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్లు శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయి రవి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గౌడ కులస్తులందరూ మాలధారణ ధరించటంతో పాటుగా విగ్రహాలు ఊరేగింపు, గౌడ పురాణం,కార్యక్రమాలు ప్రారంభమైనట్లు తెలిపారు.

ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఇంటింటా జలబిందెలు తీయటం,గుడి వద్ద గణపతి పూజ, పుణ్యా వచనం, మండపారాధన, నవగ్రహ పూజ, వాస్తు పూజ, గండ దీపం,గణపతి హోమం కంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి హోమం కుంకుమ పూజ దీపోత్సవం జరుగుతుందని రవి తెలిపారు. అదేవిధంగా బుధవారం ఉదయం 7:54 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుందన్నారు. మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం గ్రామదేవతల పూజ, బోనాలు తీయడం, స్వామి కథ, స్వామి వారి కళ్యాణం జరగనుందని ఆయన వివరించారు. స్వామివారి కల్యాణంతో ప్రాణప్రతిష్ట ప్రక్రియ ముగుస్తుందని వత్సవాయి రవి తెలిపారు.


