Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కంఠ మహేశ్వర నామ స్మరణతో మార్మోగిన కొండ వనమాల

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామంలో కంఠమహేశ్వరుడు కొలువయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ గౌడ కులదైవం కొలువుదీరారు. గౌడ కులస్తుల ఆశలకు, ఆకాంక్షలకు అద్దం పడుతూ భవిష్యత్తులో వారి కోరికలను తీర్చే కొంగుబంగారంగా కంఠమహేశ్వర స్వామి కొలువు తీరారు. శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయి రవి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. వేద మంత్రాల నడుమ, భక్తుల జయ జయ ధ్వానాలతో విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.

తొలుత గ్రామ ప్రజలందరూ వేకు జామునే పుణ్య స్నానాలు ఆచరించి ఆలయం వద్దకు చేరుకొని ఉదయం 7:54 గంటలకు విగ్రహ ప్రతిష్ట తంతు ముగించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ విరివిగా హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి సేవలో తరించారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, పక్కన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి తదితరులు

సబ్బండ వర్గాలను ఏకం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: వైరా MLA రామాదాసు నాయక్.
ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని చేపట్టిన మహా మనిషి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆనాడే బడుగు బలహీన వర్గాలను ఒక తాటిపైకి తెచ్చి తనకంటూ సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను చేజిక్కించుకున్నారని తెలిపారు. ఆ కోటనుండే ప్రజల ఆశలు ఆకాంక్షలను నిర్వర్తించే విధంగా ప్రజాపాలన కొనసాగించారన్నారు. అంతేకాకుండా పోరాటస్ఫూర్తినింపారని, దృఢమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆనాడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిరూపించారని పేర్కొన్నారు.

కంఠ మహేశ్వరుని సేవలో శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధితనే వత్వసాయి రవి కుటుంబం

దైవచింతనతో మానసిక ప్రశాంతత:శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి
దైవచింతనతో మానసిక ప్రశాంతత కలిగుతుందని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ఇందులో భాగంగానే తనకు జన్మనిచ్చిన గ్రామంలో తమ కుల దైవం కంఠ మహేశ్వర స్వామి సురుమాంబదేవిల ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు.

కంఠ మహేశ్వరుని ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కార్యాలయపు ఇన్చార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్, కొణిజర్ల మాజీ ఎంపీపీ గోసు మధు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అమరగాని వెంకన్న గౌడ్, గోపా నాయకులు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గౌడ్, డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్, గుడిద శ్రీనివాసరావు గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, బెల్లంకొండ శరత్ గౌడ్, కుక్కల నాగేశ్వరరావు గౌడ్, గ్రామ గౌడ కుల పెద్దలు వత్సవాయి పుల్లయ్య, పొలగాని సుధాకర్, మరీదు వెంకయ్య, మోతపోతుల వెంకటేశ్వర్లు, మరీదు నాగేశ్వరరావు, పొలగాని లక్ష్మీనారాయణ, బొజ్జగని రమేష్, యాదవ సంఘం పెద్దలు, పెద్ద గొల్ల జానబోయిన మల్లయ్య, గోసు సాయిబాబు, బొరిగల పుల్లయ్య, సింగాల కృష్ణ బాలాజీ ఎస్టేట్ కార్యాలయం ఇన్చార్జి పోగుల రవికుమార్, కార్యాలయపు సిబ్బంది మార్కెటింగ్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Popular Articles