ఏపీ పోలీసులు జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. గత మూడు, నాలుగు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. సాక్షి న్యూస్ ఛానల్ లో అమరావతి రాజధానిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో సాక్షి యాంకర్ కమ్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.


