Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

పవన్, సంజయ్ భేటీ వెనుక!?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పవన్ వ్యక్తిగత కార్యాలయంలో ఈ ఇద్దరు నేతలూ పరస్పరం కలుసుకోవడం గమనార్హం. దాదాపు గంట సేపు సాగిన ఈ నేతల భేటీ తెలంగాణా రాజకీయాల్లో సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ తెలంగాణా అధ్యక్షునిగా బండి సంజయ్ నియామకం తర్వాత ఆయనకు పవన్ కళ్యాన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పొరుగున గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ సంజయ్ కుమార్ తో సమావేశం కావడంపై సహజంగానే ఊహాగానాలు సాగుతున్నాయి. ఏపీ తరహాలోనే తెలంగాణాలోనూ బీజేపీతో కలిసి పవన్ పార్టీ పనిచేయవచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే వీరిద్దరి కలయిక మర్యాద పూర్వకమేనని బీజేపీ వర్గాలు చెబుతుండడం విశేషం.

Popular Articles