Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘ఆపరేషన్ కర్రెగుట్ట’పై జంపన్న ఏమంటున్నారంటే..?

మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమై ఆయుధ విసర్జన ఎజెండాలో చర్చకు సిద్ధమైన సందేశం ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మూలించడం శాంతి కమిటీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుంది. డెబ్భయి కిలోమీటర్ల పొడవు కలిగి వున్న కరిగుట్టలపై పదివేల మిలటరీ బలగాలు గత నాలుగు రోజులుగా మిలిటరీ హెలికాప్టర్ల సహాయంతో మోహరింపులు పొరుగు దేశాలతో యుద్ధాన్ని తలపింప చేస్తున్నది.

చత్తీస్ ఘడ్, తెలంగాణ మిలిటరీ బలగాల దాడులకు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తూ ఉద్యమకారులను ప్రజలను నిర్మూలించే కార్యక్రమం విషాదకరమైంది. రాజ్యాంగానికి వ్యతిరేకమైనది. శాంతికి వ్యతిరేకమైనది. యుద్ధం ద్వారా మిగిలేది స్మశానం.. ఆ స్మశానంలో ఏర్పడేది సంతోషకరమైన శాంతి కాదు. తీవ్రమైన దుఃఖంతో కూడుకున్న అసంతృప్తికి వ్యతిరేకతకు, ప్రతి హింసకు దారితీస్తాయనిది చారిత్రక సత్యం.

రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ ప్రజల, మావోయిస్టు ఉద్యమకారుల, పోలీసు బలగాల ప్రాణాలను రక్షించడం భారత పౌరులందరి బాధ్యత. ఈ విషయాన్ని రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ చెబుతున్నది. మావోయిస్టు పార్టీపైన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలతో పాటుగా వివిధ రాజకీయ సంస్థలు ప్రజా సంఘాలు విస్తృత ప్రజానీకం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రభుత్వంపై వివిధ రూపాలలో ఒత్తిడి పెంచాలని శాంతి చర్చల కమిటీ కోరుతున్నది .

ప్రజల, ప్రజాస్వామికవాదుల అభిప్రాయాలకు విరుద్ధంగా కొనసాగుతున్న యుద్ధాన్ని భారత ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ కొనసాగిస్తూ శాంతి చర్చలను వెంటనే ప్రారంభించాలని శాంతి చర్చల కమిటీ బలంగా కోరుతున్నది. శాంతి చర్చల కమిటీ ఇచ్చిన పిలుపుకు సీపీఐ మావోయిస్టు పార్టీ మాత్రమే కాకుండా వివిధ పార్టీలు వివిధ ప్రజా సంఘాలు వివిధ మేధావులు విశాల ప్రజానీకం బలమైన మద్దతు తెలుపుతూ నిర్మూలన హత్యాకాండను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత ప్రభుత్వం విశాల దృక్పథంతో , రాజ్యాంగ దృక్పథంతో, శాంతి కాముకమైన దృక్పథంతో వ్యవహరించాలని మేము బలంగా అభిప్రాయపడుతున్నాము.

మావోయిస్టు పార్టీ ఏప్రిల్ 4వ తేదీ ఇచ్చిన ప్రకటన బలమైన శాంతి సందేశాన్ని ప్రకటించింది. ఆ తర్వాత రూపేష్ పేరుతో ఏప్రిల్ 8వ తేదీ ఏప్రిల్ 14వ తేదీ వచ్చిన ప్రకటనలు గాని, ఏప్రిల్ 22వ తేదీ “బస్తర్ టాకీస్ “అనే హిందీ ఛానల్ కు గాని తమ పార్టీ శాంతి చర్చల పట్ల కాల్పుల విరమణ పట్ల, ఎలాంటి ఎత్తుగడల సంబంధం లేని, బలమైన నిజాయితీతో కూడిన సందేశంగా శాంతి కమిటీ అభిప్రాయపడుతున్నది.

శాంతి చర్చల కమిటీ లక్ష్యం తాత్కాలికమైన కాల్పుల విరమణ కోసం కాకుండా శాశ్వతమైన యుద్ధ ముగింపు లక్ష్యంగానే పనిచేస్తున్నది. శాంతి చర్చల కమిటీ మావోయిస్టు పార్టీ వివిధ సందర్భాలలో ఇచ్చిన ప్రకటనలను గమనించినప్పుడు వారితో ప్రభుత్వం గౌరవప్రదమైన చర్చలను కొనసాగిస్తే , రాజ్యాంగానికి లోబడి ప్రజల ఆకాంక్షలకు, ప్రజాస్వామ్యానికి లోబడి సరి అయిన నిర్ణయాలను చేసుకోగలిగితే శాంతి చర్చల కమిటీ కానీ పౌర సమాజం గాని కోరుతున్న శాశ్వతమైన యుద్ధ శాంతికి గొప్ప చారిత్రక ముగింపు కాగలదని మేము విశ్వసిస్తున్నాము.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే మేము మెమోరాండం పేరుతో వివిధ లేఖలను మెయిల్ ద్వారా పంపించినాము. ప్రధానమంత్రి, హోంమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా శాంతి చర్చల కమిటీ కలిసి మరొకసారి మెమొరండం ఇవ్వడమే కాకుండా వారితో చర్చించి శాంతి సాధన కోసం ప్రయత్నించాలని మేము భావిస్తున్నాము. దానికి తగిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా అపాయింట్మెంట్ ను మన్నించమని కోరుతున్నాము.

శాంతి చర్చల వాతావరణం ఏర్పడడానికి, మావోయిస్టు పార్టీ నాయకత్వం కలిసి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మావోయిస్టు పార్టీ నాయకుడు రూపేష్ కోరిన విధంగా కనీసంగా నెల రోజులు ఎలాంటి కాల్పులు లేకుండా, ఉద్రిక్త వాతావరణం లేకుండా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు ప్రకటించాలని శాంతి చర్చల కమిటీ బలంగా అభిప్రాయపడుతున్నది.

Popular Articles