బంధాలు అనుబంధాలు
అంతా సుడి గుండాలు!
రాఖీ పండుగ రోజు!
ఉదయాన్నే ఈ ఇద్దరు చెల్లెళ్ళు
అన్నలకు రాఖీలు కడితే
సోషల్ మీడియా ఆ ఫోటోలను చూసి
మురిసిపోయి షేర్ చేసేది!
వైసీపీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహా సంబురపడిపోయేవి..
బంధం అంటే ఇలా ఉండాలిరా..
అన్నయ్య సన్నిధి.. అదే మాకు పెన్నిధి..
వంటి అనేక సినిమా పాటలు వినిపించేవి!
కానీ ఈ రాఖీ పండుగకు
ఆ చెల్లికి రాఖీ దొరకలేదు!
ఈ చెల్లికీ రాఖీ కనిపించలేదు!
అన్న పిలిస్తే వస్తా
రాఖీ కడతా అని ఆ చెల్లి!
అన్న పిలవడు
ఎదురు చూపు ఎందుకని ఈ చెల్లెలు!
ఇద్దరూ రాఖీ వదిలేశారు!
ఆ నలుగురూ బంధం మరచిపోయారు!

అటు అమ్మ మదిలో కలిస్తే బావుండు..
పిలిస్తే బావుండు అనే ఆలోచన!
ఇటు తల్లి ఆలోచనా అదే!
తల్లి తల్లే!
ఎవరి తల్లి అయినా ఒక్కటే!
ఇటు తండ్రి మనసు ఎందుకో కరగడం లేదు!
అటు కరగడానికి పాపం ఆ తండ్రి లేడు!
అటు భర్త, ఇటు భర్త
ఇద్దరూ సర్ది చెప్పుకుంటూనే ఉన్నారు!
అనుబంధం, ఆత్మీయత..
అంతా ఒక బూటకం..
ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.. అంటూ లీలగా ఎక్కడో ఆ పాత పాట వినిపిస్తూనే ఉంది కదూ!
– డా. మహ్మద్ రఫీ