Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

లైవ్ లో యాంకర్.. స్టూడియోపై బాంబ్..!?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో వార్తలు చదువుతున్న న్యూస్ యాంకర్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లోనే ఇరాన్ అధికారిక టీవీ (ఐఆర్ఐబీ) యాంకర్ కు అనూహ్య అనుభవం ఎదురైంది. ప్రత్యక్ష ప్రసారంలో ఆమె వార్తలు చదువుతుండగానే స్టూడియోపై దాడి జరిగింది. ఈ పరిణామంతో బతుకు జీవుడా అనుకుంటూ యాంకర్ స్టూడియో నుంచి ఒక్క ఉదుటున వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Popular Articles