ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కనిపించారు. ఇజ్రాయెల్ తో యుద్ధం అనంతరం ఖమేనీ ప్రజల ముందుకు రావడం ఇదే మొదటిసారి. సెంట్రల్ టెహ్రాన్ లోని ఓ మసీదులో జరిగిన కార్యక్రమంలో శనివారం ఖమేనీ పాల్గొన్న వీడియోను స్థానిక మీడియా ప్రదర్శించింది. ఖమేనీనీ చూసిన అక్కడివారంతా లేచి నిలబడి, ఆయనకు మద్ధతుగా పిడికిలి బిగించి నినదిస్తున్న వీడియోను దిగువన చూడవచ్చు.