ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఆలీ ఖమేనీ బంకర్ లోకి వెళ్లి తల దాచుకున్నారా? ఆయనను ఇరాన్ అధికారులు ఈశాన్య టెహ్రాన్ లోని అండర్ గ్రౌండ్ బంకర్ లోకి తరలించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. ఇరాన్ వార్తా సంస్థలు కూడా ఇదే అంశంపై వార్తా కథనాలు వెలువరిస్తున్నాయి. ఖమేనీతోపాటు ఆయన యావత్ కుటుంబం బంకర్ లోకి వెళ్లి తల దాచుకున్నట్లు ఆయా వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సాగుతున్న భీకర పోరు ఫలితంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
