ఆంధ్రప్రదేశ్ లో ఓ ఐపీఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. డీజీపీ ఆఫీసులో ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గడచిన నెలరోజులుగా విధులకు దూరంగా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ కడప జల్లాలో ఎస్పీగా పనిచేశారు. ఈ అధికారి రాజీనామా ఉదంతంపై విపక్ష వైఎస్ఆర్ సీపీ అనుబంధ ప్రసార మాధ్యమాల్లో భిన్నకోణాల్లో వార్తా కథనాలు వస్తున్నాయి.
అయితే తాను ఒత్తిళ్లతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఐపీఎస్ అధికారి సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని, స్వచ్ఛందంగానే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇన్నేళ్లు ఏపీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వానికి ధన్యవాదలు తెలుపుతున్నట్లు సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ విడుదల చేసిన పత్రికా ప్రకటననను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.


