Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఆర్ఎస్… వీఆర్ఎస్

సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో గల ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. తనకు ఇంకా ఆరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ, తన బాధ్యతల నుంచి స్వచ్ఛంద విరమణను కోరుతూ ఆయన సోమవారం ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం గమనార్హం.

వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తన 26 ఏళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రవీణ్ కుమార్ పై ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. గురుకులాల కార్యదర్శి పదవికి ప్రవీణ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ దరఖాస్తుపై భిన్న ప్రచారం జరుగుతోంది.

Popular Articles