Top 5 This Week

Related Posts

తలవంచి ‘తుమ్మల’కు ప్రణమిల్లిన మంత్రి అజయ్

‘ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే నానుడికి అనుగుణంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర రాజకీయ దృశ్యం చోటు చేసుకుంది. అధికార పార్టీ జిల్లా రాజకీయాల్లో ఎడమొహం, పెడమొహంగా ఉన్నట్లు ప్రచారంలో గల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఈ అరుదైన సన్నివేశం సాక్షాత్కరించింది.

రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డిలు శుక్రవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును వద్దకు వెళ్లారు. ఖమ్మం గొల్లగూడెంలోని తన నివాసానికి ఇద్దరు మంత్రులు చేరుకోగానే తుమ్మల నాగేశ్వరరావు వారిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తన కారు నుంచి దిగిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తుమ్మల నాగేశ్వరరావు ముందు తలవంచి ఆయన పాదాలకు ప్రణమిల్లేందుకు ప్రయత్నించారు. అయితే కిందకు వంగిన పువ్వాడ అజయ్ ను తుమ్మల మధ్యలోనే నిలువరించి పైకి లేపారు. ఆయా అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles