Top 5 This Week

Related Posts

అరణ్య బంగారం.. కాళేశ్వరం!

త్రేతా యుగంలో దండకారణ్యంలో రాముడు సంచరించి ముక్తేశ్వరుని పూజించిన రామ క్షేత్రం కాళేశ్వరం. ఆనాటి నుంచి దట్టమైన అడువులతో రాకపోకలు లేని సమయ లో వన్యప్రాణుల భయంతో ఘోర అరణ్యంగా ఉన్న కాళేశ్వరంలో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో క్షేత్రవాసులు అనేక ఇబ్బందులు పడి హైదరాబాద్, బొంబాయి, పుణే, నాగపూర్ తదితర పట్టణ ప్రాంతాలకు జీవనోపాధి కోసం ప్రవాసం వెళ్లారు.
దానికి సాక్ష్యంగా గ్రామస్తులు ఒక శ్లోకం చెప్పేవారు –

దీనిని బట్టిచూస్తే అర్థం అయ్యేది ఏమిటంటే కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి లేనటువంటి క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్వం దేశమంతటా కరువు కాటకాలు ఏర్పడ్డాయని అర్థం.ప్రాచీన కాలంలో క్షామం వచ్చినపుడు గౌతమ మహర్షి ఇక్కడ దేశ ప్రజలకు అన్నదానం చేశాడని మనకు గోదావరి చరిత్ర చెబుతుంది. గో హత్యా పాతకాన్ని పోగొట్టడానికి గౌతమ ముని కోసం కాళేశ్వరం వరకు వచ్చింది గోదావరి. ఆనాడు బాధలో ఉన్న వారికి తిండి పెట్టిన ప్రాంతమే ఘోర అరణ్యంగా మారి తిండి బట్ట లభించని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా కొన్ని శతాబ్దాలు గడిచాయి. ఆ తర్వాత కాళేశ్వరానికి మహర్దశ వచ్చింది.

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 1965లో ఈ ప్రాంతంలో మంథని నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచి కాళేశ్వర క్షేత్ర జీర్ణోద్ధరణ చేయడానికి నిశ్చయించుకున్నారు. దానికి యోజనలు తయారు చేశారు. కానీ అనివార్య కారణాలవల్ల వ్యక్తిగతమైన వంటి విషయాల వలన ఆయన చేయలేకపోయారు. అదే ప్రణాళికను జగద్గురు శంకరాచార్యుల ఆదేశానుసారం అప్పటి రాష్ట్ర మంత్రి జువ్వాడి చొక్కారావు 1976 మార్చ్ నెలలో కాళేశ్వరం వచ్చి ఈ క్షేత్ర పునరుద్ధరణకు కంకణం కట్టుకున్నారు. మొదటగా రెండు బస్సులు రవాణా సౌకర్యం కోసం వేయించారు. ముఖ్య ఆలయంలో మహాన్యాస పూర్వకంగా ప్రతిరోజు ఏకాదశ రుద్రాభిషేకం జరిగే విధంగా పండితులను నియమించారు. ఆంధ్రపత్రిక ద్వారా చందాలు వసూలు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించారు.

పీవీ నరసింహారావు (ఫైల్)

అప్పుడు కాళేశ్వరంలో వివిధ దేవాలయాలు ఉండేవి. బిందు మాధవస్వామి, బాల రాజేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ, సదాపూర్ణ, సరస్వతి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మ దేవాలయం, వెంకటేశ్వర ఆలయం, రామాలయం సంగమేశ్వరాలయం వీరభద్రాలయం, జయ విజయులు, సూర్యనారాయణమూర్తి దేవాలయాలు, అహల్య,గౌతముడు, సనకసనందన, సనత్కుమారులు, నారదుడు, కాలభైరవుడు, నీలకంఠేశ్వరుడు, సురాభాండేశ్వరుడు, రాతిధ్వజ స్తంభం, దానిపైన నంది, దేవాలయానికి కిలోమీటరు దూరంలో ఆదిముక్తీశ్వర, మధ్యముక్తీశ్వర, వీరాంజనేయ, చంద్రశేఖర్, సోమశేఖర, నర్సింహేశ్వర దేవాలయాలు ఉండేవి.

ముందు భేరీశాల అనే ప్రవేశద్వారం ఉండేది. ఆ భేరీశాలలో సుమారు 20 శిలాశాసనాలు రాసి ఉండేవి. జీర్ణోద్ధరణ సమయంలో అవి అంతరించి పోయాయి. చొక్కారావుతో పాటుగా ఆంధ్ర పత్రిక సంపాదకులు, వివిధ ఆధ్యాత్మికవేత్తలు, పీవీ నరసింహారావు మొదలైన నాయకులు, నటరాజన్ ,జి.పి. రావు, కే.ఎస్.శర్మ, కమలేశ్వర్ రావు కలెక్టర్లు జీర్ణోద్ధరణ కోసం కాళేశ్వరం వచ్చి అభివృద్ధి పనుల పై దృష్టి సారించారు. మొదటగా విజయ గణపతి దేవాలయానికి శిలా స్థాపన చేయించి విజయ గణపతి దేవాలయాన్ని నిర్మించి డిసెంబర్ 1976లో అభినవ విద్యా తీర్థ స్వామి భారతి తీర్థ స్వామి జగద్గురు శంకరాచార్యులు వచ్చి కరకమలముతో ప్రతిష్ఠలు జరిపించారు.

ఆ తర్వాత జీర్ణమైన దేవాలయాలను తొలగించి నూతన నిర్మాణాలను చేపట్టారు. ప్రజల రాకపోకలకు 1980 నుంచి 1981 వరకు మహాదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు మెరుగైన మెరుగైన రహదారి సౌకర్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక బస్సులు వేయించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచారు. అదేవిధంగా 1982 ఫిబ్రవరి 9వ తేదీన శృంగేరి జగద్గురు విద్యాతీర్థ స్వామి భారతీ తీర్థ స్వామి చేతుల మీదగా రాజగోపురం విమాన గోపురంపైన కలశస్థాపన ప్రతిష్ఠలు, మహా కుంభాభిషేకాలు నిర్వహించారు. అప్పటినుంచి అభివృద్ధి ప్రవర్ధమానమై, సంపూర్ణమైన రమణీయ దర్శనీయ స్థలంగా విరాజిల్లుతోంది.

అభివృద్ధిలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేసిన దుద్దిళ్ళ శ్రీపాదరావు క్షేత్ర అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. కాళేశ్వరంలో ఆది ముక్తేశ్వరాలయం, సంగమేశ్వరాలయం, దత్తాత్రేయాలయం తదితరములు వారి చేతుల మీదుగా అభివృద్ధి జరిగింది .ప్రతిష్ఠాపన జరిగింది. ఆ తర్వాత శ్రీపాదరావు కుమారుడు ప్రస్తుత ఐ.టి. శాఖ మంత్రి శ్రీధర్ బాబు హయాంలో దేవాలయంలో ఎన్నో అభివృద్ధి పనులను సాధించారు. గతంలో వేములవాడ తిరుపతి దేవస్థానం కట్టించిన గదులు మాత్రమే ఉండగా ఇంకా ఎన్నో వసతి సౌకర్యాలు కల్పించారు. హోమ మండపం, వంటశాల ప్రసాదాల వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు.

శ్రీపాదరావు (ఫైల్)

ఇలా పరిపూర్ణమైన అభివృద్ధి పనులను చేయించడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం రూ.25 కోట్ల నిధులతో ఆలయ ప్రాంతం చుట్టూ అభివృద్ధి పనులు చేపట్టారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద సరస్వతి మాత విగ్రహంతో పాటు పుణ్య స్నానఘట్టాలు పుష్కర ఘాట్లు పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విధంగా పరిపూర్ణమైన కాళేశ్వరానికి రోజు వేలాది మంది భక్తులు మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ నుంచి లక్షలాది భక్తులు విచ్చేసి వారి కోరికలను తీర్చుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

అయితే ఆనాడు విలువ లేని భూములకు ఈనాడు కోట్ల రూపాయల ధరలకు పెరిగి మెరిసిపోతున్నాయి. ఆనాటి గుడిసెలు నేడు భవంతులుగా ఏర్పడ్డాయి. గతంలో ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా తిరిగి కాళేశ్వరం చేరుకుని స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో గజానికి రూ. 35 నుంచి 40 వేలు పలుకుతున్న ధర కాళేశ్వరంలో రూ. 70 వేల వరకు పలుకుతోంది. అంత ధర పెట్టినా భూమి దొరకడం లేదు.

Popular Articles