Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పింక్ మీడియాకు పొంగులేటి స్వీట్ వార్నింగ్

పింక్ మీడియాకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటు పడుతోందన్నారు. కమ్యూనిస్టులు కోరుకుంటున్న ప్రజాసంక్షేమ పాలననే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. పత్రికా స్వేచ్ఛను తాము గౌరవిస్తున్నామని, వక్రీకరణల రాతలను రాస్తున్న తమకు ఇష్టం లేని పత్రికలను ఇందులో భాగంగానే ఉపేక్షిస్తున్నట్లు చెప్పారు. నిజాలను అబద్ధాలుగా చిత్రీకరిస్తున్న పత్రికలకు సంబంధించి వారి మానాన వారే పోతారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవారు తమ అవివేకాన్ని, తప్పిదాలను తెలుసుకుంటారనే ఉద్ధేశంతో ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తున్నదన్నారు. భవిష్యత్తులో కూడా ఒక స్థాయి వరకే ప్రభుత్వం ఉపేక్షిస్తుందని పింక్ కలర్ మీడియా మిత్రులకు చెబుతున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సీపీఎం పత్రిక ‘నవ తెలంగాణ’ పదో వార్షికోత్సవ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.

Popular Articles