Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

బాబోయ్… అరటి గెలకు నాటుసారా!

అరటి గెలకు నాటుసారా కాయడం ఏమిటీ…? అని అశ్చర్యపొకండి. శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు అంటే ఇదే కాబోలు మరి. కరోనా లాక్ డౌన్ పరిణామాల్లోనూ నాటుసారా తయారీదారుల ఆగడాలు సాగుతూనే ఉన్నాయి. కావాలంటే చూడండి. ఓ ప్రబుద్ధుడు అరటి గెల మాటున నాటుసారా సంచులను ఏమాత్రం అనుమానం రాకుండా ఎంత ఒడుపుగా ప్యాక్ చేశాడో! అరటి గెల మాటున నాటుసారాను అక్రమంగా రవాణా చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలో ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన నాటుసారా తయారీ, రవాణాలో కొత్త పుంతలకు నిదర్శనంగా నిలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=8Ew0iY37mUo

Popular Articles