Top 5 This Week

Related Posts

రికార్డ్ బ్రేక్.. లడ్డూ రూ. ఎన్ని కోట్లంటే..!?

విఘ్నేశ్వరుని లడ్డూ వేలంలో ఇది భారీ రికార్డ్. గత రికార్డును బద్దలు కొడుతూ వినాయకుని లడ్డూను కోట్ల రూపాయలకు భక్తులు సొంత చేసుకోవడం విశేషం. హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూకు వేలం నిర్వహించగా, రికార్డు స్థాయిలో కోట్ల రూపాయల మేరకు ధర పలకడం ప్రత్యేకత.

ఇక్కడి కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణనాథుని లడ్డూకు వేలం నిర్వహించగా, రూ. 1.87 కోట్లకు విల్లా కమ్యూనిటీ మొత్తం లడ్డూను దక్కించుకుంది. గతంలో కూడా ఇక్కడి లడ్డూకు భారీ ధర పలకడం గమనార్హం. గతంలో ఇక్కడి లడ్డూ వేలం రూ. 1.26 కోట్లు పలకగా, ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ రూ. 1.87 కోట్లకు చేరుకోవడం విశేషం.

Popular Articles