హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. క్వారీ యజమానిని బెదిరించారనే అభియోగంపై నమోదైన కేసులో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని పోలీసులు హన్మకొండకు తరలించారు. క్వారీ యజమానికి బెదిరించినట్లు అందిన ఫిర్యాదు ఘటనలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ చట్టంలోని 308(2), 308(4), 352 సెక్షన్ల కింద సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
