Top 5 This Week

Related Posts

సీఎం కోటలో రేవంత్ హల్ చల్… వీడియో!

తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు హాజరైన అశేష జనవాహిని అంశం రాజకీయ చర్చకు తావు కల్పించింది. గజ్వేల్ లో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొన్న జనాన్ని చూసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించడం విశేషం.

దమ్ముంటే గజ్వేల్ వచ్చి సభను తిలకించాలని రేవంత్ సవాల్ విసిరారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాం నుంచి మెదక్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పాటుపడిన అనేక అంశాలను రేవంత్ సభలో వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ వెన్నుపోటు పొండిచారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనపై గజ్వేల్ సభలో చార్జ్ షీట్ ను కూడా విడుదల చేశారు. మొత్తంగా గజ్వేల్ సభ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మాంచి జోష్ నింపినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గజ్వేల్ సభకు హాజరైన జన ప్రవాహపు వీడియోను దిగువన వీక్షించవచ్చు.

https://www.facebook.com/revanthofficial/videos/4105917669535738

Popular Articles