Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సమంత.. తిరుపతి కోడలు!

కోయంబత్తూర్: హీరోయిన్ సమంత తిరుపతి పట్టణ కోడలైంది. ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది. తిరుపతి పట్టణానికి కోడలుగా మారింది. అందరూ అనుకున్నట్లు తన ఫ్యాషన్ డిజైనర్ ను కాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాత దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరును సోమవారం కోయంబత్తూర్ ఈషా కేంద్రంలోని లింగ భైరవ ఆలయంలో వివాహం చేసుకుంది.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత నటించిన సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరూ ముంబైలో సహజీవనం చేస్తున్నారు. సమంత మొదటి పెళ్ళి అక్కినేని నాగ చైతన్యతో 2017లో జరిగింది. కానీ ఆ తర్వాత 2021లో విడిపోయారు. ప్రస్తుతం సమంతను పెళ్లి చేసుకున్న రాజ్ వివాహం 2015లో శ్యామలతో జరగ్గా, 2022లో వీళ్లిద్దరూ విడిపోయారు.

రాజ్ – సమంత, రాజ్ మొదటి భార్య శ్యామల

రాజ్ నిడిమోరు తిరుపతి వాస్తవ్యులు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేసి సినిమా రంగంలోకి వచ్చారు. మొత్తం ఎనిమిది సినిమాలకు ఇప్పటి వరకు దర్శకునిగా, రచయితగా పని చేశారు. అతను తీసిన స్త్రీ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ సహ నిర్మాతగా ఉన్నారు. కాగా ఇవాళ రాజ్ మొదటి భార్య శ్యామలి తన ఇష్టాగ్రామ్ లో ‘బరి తెగించిన వ్యక్తులు’ అని పోస్ట్ చేయడం గమనార్హం.

Popular Articles