సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని బీఆర్ఎస్ నాయకులు గురువారం కలిశారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణా హోటల్ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఎంపవర్డ్ కమిటీని కలిసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కమిటీకి బీఆర్ఎస్ పార్టీ బృందం నివేదిక సమర్పించింది. కమిటీని కలిసిన బీఆర్ఎస్ నాయకుల్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

తీవ్ర వివాదాస్పదమైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను పరిశీలించేందుకు పర్యావరణ, అటవీ శాఖలకు చెందిన ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చింది. ఈ భూములపై క్షేత్ర స్థాయిలో పరిశీలిన చేసిన తమకు నివేదిక సమర్పించాలని ఎంపవర్డ్ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాజధానికి వచ్చిన ఎంపవర్డ్ కమిటీని బీఆర్ఎస్ నాయకులు కలిసి తమ వాదనతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.