Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఎమ్మెల్సీగా కవిత… వినూత్న అభిమానం

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు వినూత్న తరహాలో తన అభిమానాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు ఓ అభిమాని.

నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో కవితకు శుభాకాంక్షలు తెలిపారు. నలభై ఫీట్ల పొడవు గల ఈ భారీ శుభాకాంక్షల ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించడం విశేషం.

Popular Articles