Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ది గ్రేట్ ఎస్కేప్! క్యా ‘బాతు’ హై!?

అప్పుడెప్పుడో వచ్చిన హాలీవుడ్ సినిమా పేరు కాదు లెండి ఈ శీర్షిక. ప్రమాదం ముంచుకొచ్చినపుడు అది పెద్దపులి అయినా సరే ‘బురిడీ’ కొట్టించి ‘బుడుబుంగ’ లాగా నీటిలోనే మాయమైన బాతు కథ ఇది. ఓ బాతు హాయిగా నీటిలో ఈదుతోంది. కానీ అదే నీటిలోకి ఓ పెద్దపులి కూడా చేరింది. ఈ చిరుప్రాణిని కూడా వేటాడి తినేందుకు ‘పంజా’ విసరలేదు గాని, ఒక్క ఉదుటున బాతును మింగేందుకు ప్రయత్నించింది.

కానీ బాతు ఏం చేసిందో తెలుసా? ‘బుడుంగు’న నీటిలో మునిగి పెద్దపులికి ‘గాయిగత్తర’ లేపింది. కళ్ల ముందు కనిపించిన బాతు ఎక్కడికి వెళ్లిందో తెలియక పెద్దపులి బిత్తరపోయి…బిక్క మొహం వేసుకుని చూస్తోంది. ‘గ్రేట్ ఎస్కేప్’ పేరుతో ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఆయా వీడియోను దిగువన మీరూ చూసేయండి.

https://twitter.com/buitengebieden_/status/1288236951645097986

Popular Articles