Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మాజీ VRO, VRAలకు గుడ్ న్యూస్

తెలంగాణాలోని మాజీ వీఆర్వోలకు, వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ స్థాయి అధికారుల (విలేజ్ లెవెల్ ఆఫీసర్స్) పోస్టులను మంజూరు చేసింది. ఈమేరకు ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీఆర్వోలను, వీఆర్ఏలను వివిధ ప్రభుత్వ విభాాగాల్లో సర్దుబాటు చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 10,954 వీఎల్ వో పోస్టుల్లో మాజీ వీఆర్వోలను, వీఆర్ఏలను సర్దుబాటు చేయనున్నారు. ఆప్షన్ల ద్వారా వీరిని గ్రామాల వారీగా నియమించున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు

Popular Articles