Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

మోగిన GHMC ఎన్నికల నగారా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి విడుదల చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలనాట ఓటరు జాబితా, 2016 ఎన్నికలనాటి రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.

– రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ
– ఈనెల 20న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
– 21న నామినేషన్ల పరిశీలన
– 22న నామినేషన్ల ఉపసంహరణ గడువు

– 22నే అభ్యర్థుల తుది జాబితా, ఎన్నికల గుర్తుల కేటాయింపు
– డిసెంబర్ 1న పోలింగ్
– డిసెంబర్ 3న అవసరమైతే రీపోలింగ్
– డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్

Popular Articles