ఏపీలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే అభియోగంపై నమోదైన కేసులో వంశీని నిన్న పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి వంశీని విజయవాడకు తరలించిన పోలీసులు గత రాత్రి విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.
ఈ కేసులో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు వాద, ప్రతివాదనలు విన్న జడ్జి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ మాజీ ఎమ్మెల్యే వంశీతోపాటు అతని అనుచరులు లక్ష్మిపతి, శివరామక్రిష్ణ ప్రసాద్ లకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ తెల్లవారుజామున వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

