Top 5 This Week

Related Posts

భారీ ఎన్కౌంటర్: ఐదుగురు నక్సల్స్ మృతి

మహారాష్ట్ర అడవుల్లో కొద్ది సేపటిక్రితం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకరపోరులో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఖురుకేడ తాలూకా కొబ్రామెండ అడవుల్లో గడచిన మూడు రోజులుగా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. తాజాగా సోమవారం మరోసారి జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లు మరణించారు. మరికొందరు నక్సలైట్లు తప్పించుకున్నారని, వారికోసం గాలిస్తున్నట్లు గడ్చిరోలి ఎస్పీ ప్రకటించారు. నక్సల్స్ ను పూర్తి స్థాయిలో ఏరివేసేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Popular Articles