Top 5 This Week

Related Posts

సమాచార శాఖలో జేడీలుగా నలుగురికి పదోన్నతి

తెలంగాణా రాష్ట్ర సమాచార శాఖలో నలుగురు అధికారులకు పదోన్నతి లభించింది. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ హోదాలో గల ఆయా నలుగురికి జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు. పదోన్నతి పొందినవారిలో మహ్మద్ ముర్తుజా, డి. శ్రీనివాస్, కె.వి. రమణ, ఎం. మధుసూదన్ ఉన్నారు.

పదోన్నతి పొందినవారిలో ముర్తుజాను ప్రెస్ అకాడమీ సెక్రటరీగా, డి. శ్రీనివాసును ఆరవ జోన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా, కె.వి. రమణను జీహెచ్ఎంసీ పీఆర్వోగా నియమించారు. మధుసూదన్ పోస్టింగ్ ఖరారు కావలసి ఉంది.

ఫొటో: జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన మహ్మద్ ముర్తుజా

Popular Articles