Top 5 This Week

Related Posts

కలెక్టర్ పై దాడి కేసులో సూత్రధారి బ్రదర్ అరెస్ట్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటనలో కీలక నిందితుని సోదరున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా విలేజ్ భూసేకరణకోసం గ్రామ సభలో పాల్గొనేందుకు లగచర్ల గ్రామానికి వెళ్లిన కలెక్టర్ పై, ఇతర అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

లగచర్ల ఘటనకు కీలక సూత్రధారికి వార్తల్లోకి వచ్చిన భోగముని సురేష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నాలుగు టీంలు సురేష్ కోసం గాలిస్తున్నాయి. అయితే ఈ కేసులో తాజాగా నలుగురుని అరెస్ట్ చేశారు.సురేష్ సోదరునిపాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం పరిగి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాసేపట్లో వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా ఇదే కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Popular Articles