Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ కు రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాపై మాజీ మంత్రి, జగిత్యాలకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈనెల 25వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

తాను ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని కూడా వెల్లడించారు. గడచిన 20 నెలలుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నానని, అవమానాలకు గురవుతూ పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈనెల 25వ తేదీన మీతో సమావేశం అవుతానని, మీ సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కేడర్ కు విడుదల చేసిన లేఖలో ఆయన ప్రకటించారు.

ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు విడుదల చేసిన లేఖ ప్రతిని దిగువన చూడవచ్చు..

Popular Articles