Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘ఈటెల’ జోర్దార్ పర్యటన!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో జోర్దార్ పర్యటన చేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురి కావడం, తాజాగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటన అనంతరం ఈటెల తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శంభునిపల్లిలో మహిళలు రాజేందర్ కు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన నుదుట తిలకం దిద్ది ‘జై ఈటెల… జై జై ఈటెల’ అంటూ నినదించారు. అదేవిధంగా యువకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు.

Popular Articles