Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

కరోనాతో మాజీ మంత్రి మృతి

తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి ఒకరు కరోనాకు బలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన అప్పటి మేడారం నియోజకవర్గ ఎమ్మెల్యే మాతంగి నర్సయ్యకు ఇటీవల కరోనా సోకింది. హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మంగళవారం తుదిశ్వాస విడిచారు.

డెబ్బయి ఆరేళ్ల వయస్సు గల నర్సయ్యకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, ఫలితంగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారని వైద్యవర్గాలు చెప్పాయి. నర్సయ్య భార్య జోజమ్మ కూడా వారం రోజుల క్రితం మరణించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Popular Articles